PM Modi..అల్లర్ల తర్వాత..తొలిసారి మణిపూర్కు ప్రధాని మోదీ..గిప్పుడొచ్చి ఏం చేస్తారంటున్న ప్రతిపక్షాలు

PM Modi..అల్లర్ల తర్వాత..తొలిసారి మణిపూర్కు ప్రధాని మోదీ..గిప్పుడొచ్చి ఏం చేస్తారంటున్న ప్రతిపక్షాలు

2023 మేలో అల్లర్లు చెలరేగిన  రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ తొలిసారి శనివారం( సెప్టెంబర్13) మణిపూర్‌లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ మణిపూర్ పర్యటనపై ఇప్పుడు.. గత కొద్దిరోజులుగా అప్పుడూ అంటూ ప్రచారం సాగింది. అయితే  ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ప్రధాని మోదీ మణిపూర్ పర్యటనను శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధృవీకరించారు.

మొదట మణిపూర్ లో జాతి హింసలో మెయిటీ ,కుకి వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో నిరాశ్రయులైన చురచంద్ పూర్ జిల్లా ప్రజలను ప్రధానిమోదీ పరామర్శించనున్నారు. మణిపూర్ రాష్ట్రవ్యాప్తంగా రూ. 7వూల300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనతరం పీస్ గ్రౌండ్‌లో జరిగే సభలో ప్రసంగించనున్నారు. ప్రధానమోదీ పర్యటించే చురచంద్ పూర్ జిల్లా అల్లర్లతో అత్యంత తీవ్రంగా నష్టపోయిన జిల్లా. అల్లర్లలో ఈ జిల్లాలో  దాదాపు 260 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. 

శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు చురచంద్‌పూర్ కు చేరుకున్నారు ప్రధాని. అక్కడ ప్రజలను పరామర్శించిన తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు వెళ్లనున్నారు. అక్కడ రూ. 1200 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. 

మోదీ పర్యటన ప్రతిపక్షాల విమర్శలు..

ఘర్షణలు తలెత్తి రెండేళ్లు పూర్తి అయిన తర్వాత ప్రధాని మోదీ మణిపూర్ పర్యటనకు రావడం ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మణిపూర్‌లో మే 3,2023న హింస ప్రారంభమైంది. మెయిటీ కమ్యూనిటీ షెడ్యూల్డ్ తెగ హోదా డిమాండ్‌ను నిరసిస్తూ కొండ జిల్లాల్లో కుకి గిరిజన మధ్య ఘర్షణలు.. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు ప్రధాని మోదీ  మణిపూర్ కు రావడంపై తీవ్ర విమర్శలు చేశారు.  

►ALSO READ | సుప్రీంకోర్టు హై-సెక్యూరిటీ జోన్‌లో వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ బ్యాన్.. ఎందుకంటే..?

2023 ఆగస్టులో ప్రతిపక్షాలు కాంగ్రెస్ తో సహా ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి మణిపూర్ అంశంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాయి. అయితే ఈ విషయంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎదురుదాడికీ దిగింది. అధికారంలో ఉన్నప్పుడు ఈశాన్యంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపింది. దేశం మీతో ఉందని, త్వరలో శాంతికి మార్గం దొరుకుతుందని మణిపూర్ ప్రజలకు హామీ ఇచ్చారు ప్రధాని మోదీ.

ప్రధాని మోదీ రేపు మణిపూర్ లో పర్యటిస్తారని విషయం తెలుసుకున్న మణిపూర్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఇంతలేటుగా వచ్చి మణిపూర్ లో ప్రధాని మోదీ ఏం చేస్తారు.. ఎవరినీ పరామర్శిస్తారు అని ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయలబ్ది కోసమే మోదీ మణిపూర్ లో పర్యటిస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు.