డియోగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన మోడీ

డియోగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని  ప్రారంభించిన మోడీ

జార్ఖండ్ లోని డియోగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, గవర్నర్ రమేష్ బాయిస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. రాష్ట్రాల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి జరుగుతుందని, గత 8 ఏళ్లుగా దేశం ఇదే ఆలోచనతో పనిచేస్తోందని అన్నారు.  

జార్ఖండ్‌ను హైవేలు, రైల్వేలు, ఎయిర్‌వేలు, జలమార్గాల ద్వారా అన్ని విధాలుగా అనుసంధానించే ప్రయత్నంలో  ఈ ఆలోచన స్ఫూర్తినిచ్చిందని ఆయన అన్నారు.  ఇక జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మాట్లాడుతూ..  " ఈ రోజు డియోఘర్‌కు మాత్రమే కాకుండా  జార్ఖండ్ మొత్తానికి చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు. 2010లో విజన్‌ చేసిన ఈ ఎయిర్‌పోర్టు కలను ప్రధాని మోడీ నెరవేర్చారని,  ఇది గర్వకారణమని "  అని సోరెన్ అన్నారు.  

ఇక డియోగర్‌  విమానాశ్రయాన్ని  657ఎకరాల్లో రూ.401 కోట్లతో  నిర్మించారు. 2,500 మీటర్ల పొడవైన రన్‌వేను ఏర్పాటు చేశారు. ఎయిర్‌బస్‌లు సులువుగా టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేందు కోసం ఇలా ఏర్పాటు చేశారు. 5,130 చదరపు అడుగుల్లో టర్మినల్ నిర్మాణం చేపట్టారు. ఇందులో 6 చెక్ ఇన్ డెస్క్‌లు ఉంటాయి. ఒకేసారి 200 మంది ప్రయాణికులు వెళ్లే విధంగా దీన్ని డిజైన్ చేశారు.