హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ జాతికి అంకితం చేసిన మోడీ

హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ జాతికి అంకితం చేసిన మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్‌లోని మొహాలీలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ని జాతికి అంకితం చేశారు. భారత ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలోని టాటా మెమోరియల్ సెంటర్, ఎయిడెడ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా రూ. 660 కోట్ల వ్యయంతో ఆస్పత్రిని నిర్మించారు. ఇది 300 పడకల సామర్థ్యంతో  నిర్మించిన దవాఖానాలో ప్రపంచ స్థాయి సామర్థ్యం కలిగిన అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. రేడియోథెరపీ,మెడికల్ ఆంకాలజీ, కెమోథెరపీ, ఇమ్యునోథెరపీ,బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ వంటి శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ అన్ని రకాల క్యాన్సర్‌లకు చికిత్స చేయవచ్చు. 2014కి ముందు దేశంలో 400 కంటే తక్కువ మెడికల్ కాలేజీలు ఉండేవని.. గత 8 ఏండ్లలో దేశంలో 200 కంటే కొత్త వైద్య కళాశాలలు నిర్మించామన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు. అందుకే వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. 

అంతకుముందు హర్యానాలోని ఫరీదాబాద్‌లో అమృత ఆసుపత్రిని కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. మాతా అమృతానందమయి మఠం ద్వారా నిర్వహించబడుతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 2,600 పడకలు ఉన్నాయి. దాదాపు రూ. 6000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రి ఫరీదాబాద్,ఎన్‌సిఆర్ ప్రాంతం మొత్తం ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందిస్తుంది.