
చిత్తూరు జిల్లాలో మహిళను కరెంటు స్తంభానికి కట్టేసిన ఘటన చోటు చేసుకుంది. పొలంలో ఉన్న కరెంటు స్తంభానికి మహిళను కట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరు కట్టేశారో.. ఎందుకు కట్టేశారో పోలీసులు వచ్చి విచారణ చేసే దాకా రహస్యం బయటపడలేదు. ఈ ఘటనలో ట్వి్స్ట్ చూసి పోలీసులే షాకయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. శాంతిపురం మండలం కర్లఘట్ట తమ్మిగానిపల్లి గ్రామంలో ఓ మహిళను కరెంటు స్తంభానికి కట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ ఘటన వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ చేపట్టారు.
డీఎస్పీ పార్థసారథి చెప్పిన వివరాల ప్రకారం.. కర్లఘట్ట గ్రామానికి చెందిన మునెప్ప అనే వ్యక్తికి మునెమ్మ, గంగమ్మ అనే ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య మునెమ్మ చాలా కాలం కిందటే చనిపోయింది. అయితే మునెప్ప అనారోగ్యంతో జులై 5 న మరణించాడు.
Also Read:-హైదరాబాద్లోని ఈ ఇంట్లో ఏడేళ్లుగా ఎవరూ లేరు.. ఇంట్లో చూస్తే అస్థి పంజరం కనిపించింది !
మునెప్ప చిన్నభార్య గంగమ్మ కొడుకు సురేష్.. తన తల్లి గంగమను కరెంటు స్తంభానికి కట్టేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన తల్లిని తన అన్న (మునెమ్మ కొడుకు) స్తంభానికి కట్టేశాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆస్తి తగాదాల కారణంగా మంజునాథ్ ఇలా చేశాడని సురేష్ ఆరోపించాడు.
అయితే సురేష్ చెప్పినదంతా అవాస్తవమని డీఎస్పీ పార్థసారథి స్పష్టం చేశారు. ఆస్తి పంపకాలు జరగాలంటే వివాదం జరగాలనే ఉద్దేశంతోనే సురేష్ ఈ వీడియో క్రియేట్ చేశాడని పోలీసులు తెలిపారు. విచారణలో తనే ఆ పని చేసినట్లు ఒప్పుకున్నాడని చెప్పారు. అవాస్తవాలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
చిత్తూరు జిల్లాలో తల్లిని కరెంటు స్తంభానికి కట్టేసిన కొడుకు.. మామూలు ట్విస్ట్ కాదు pic.twitter.com/dFrHTlBeZ5
— Mahadev Narumalla✍ (@Kurmimahadev) July 14, 2025