
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాపులు తెరిస్తే.. తమ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపులు తెరిచామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదవాడు.. ఉన్నవాడు అనే తేడా లేకుండా అందరూ లైన్లో నిలబడి సన్నబియ్యం తీసుకుని కడుపునిండా తింటున్నారని.. ఇది చూసి బీఆర్ఎస్ నేతలు కడుపులో మంట పెట్టుకుంటున్నరని విమర్శించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. సోమవారం (జులై 14) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి తిరుమల గిరిలో రేషన్ కార్డుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ కామెంట్స్:
- వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1
- ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు బోనస్ ఇచ్చాం
- రైతు పండించిన దాన్యం ప్రతి గింజను కొంటున్నాం
- ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం కానుకగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం
- బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడమే కాదు..
- బస్సులకు ఓనర్లను చేయాలని వారిని యజమానులను కాంగ్రెస్ పార్టీ చేసింది
- 200 యూనిట్ విద్యుత్ ఉచితంగా ఇవ్వటమే కాదు..
- 1000 మెగా వాట్ల ప్లాంట్లు ఆడబిడ్డలకు ఇచ్చి కోటీశ్వరలును చేస్తున్నాం..
- పెట్రోల్ బంకులను, సోలార్ ప్లాంట్లను కూడా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చేలా ప్రోత్సహిస్తున్నాం..
- గతంలో అంబానీ, అదానీ చేసే వ్యాపారాలను మహిళా సంఘాలు చేసుకునేలా చేస్తున్నాం
- స్కూల్ పిల్లలకు బట్టలు కుట్టే కాంట్రాక్టులు కూడా మహిళలకు ఇస్తున్నం
- రైతు భరోసా ఇవ్వడంలేదని ఇంటింటికి వెళ్లి దొంగ ఏడ్పులు ఏడ్చారు
- 9 రోజుల్లోనే అందరికీ భరోసా పూర్తి చేశాం
- రైతే రాజు అయినప్పుడు ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుంది
- ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ..
- 1931 తర్వాత ఇండియాలో కులగణన చేసిన రాష్ట్రం తెలంగాణ
- మోదీ మెడలు వంచి కులగణన చేసే విధంగా చేసినం
- స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం
- పాలితులుగా ఉన్నోళ్లను పాలకులుగా చేస్తాం
- దండం దొరా అన్నోళ్లు.. రాజ్యాన్ని నడిపే విధంగా చేస్తాం