
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ ద్వారా ఇచ్చిన దొడ్డు బియ్యం 80 శాతం వృథా అయ్యేవని మంత్రి ఉత్తమ్ కుమారర్ రెడ్డి అన్నారు. దొడ్డు బియ్యం కోళ్ల ఫారాలకు, బీర్ల కంపెనీలకు వెళ్లేవని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పథకం తీసుకొచ్చిందనీ.. ఇది చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. సోమవారం (జులై 14) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి తిరుమల గిరిలో రేషన్ కార్డుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజు అని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉగాది నుంచి దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. గత సర్కార్ దొడ్డు బియ్యం కూడా నాణ్యంగా ఇవ్వలేదని విమర్శించారు. రేషన్ పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టామని తెలిపారు మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షల మందికి సన్నబియ్యం ఇస్తోందని చెప్పారు.
కాళేశ్వరం కట్టింది.. కూలింది బీఆర్ఎస్ హయాంలోనేనని మంత్రి ఉత్తమ్ అన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పారు.
►ALSO READ | బీజేపీకి తెలంగాణపై ప్రేమ లేదు.. బనకచర్లపై కేంద్రంతో పోరాటమే: MP వంశీ