పంచెకట్టులో కాశీ తమిళ సంగమానికి హాజరైన మోడీ

పంచెకట్టులో కాశీ తమిళ సంగమానికి హాజరైన మోడీ

ప్రధాని మోడీ ఎక్కడికి వెళ్లినా స్థానికత ఉట్టిపడేలా డ్రెస్సింగ్ చేసుకుని అందరినీ ఆకట్టుకుంటుంటారు. తాజాగా గతంలో ఎన్నడూ లేని విధంగా పంచెకట్టులో కనిపించి ఆయన అందరి దృష్టి ఆకర్షించారు. పంచెకట్టులో మోడీ పర్ఫెక్ట్ గా సెట్టయ్యారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీలో కాశీ తమిళ సంగమం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్రమోడీ వెళ్లారు. ఆ కార్యక్రమానికి ఆయన పంచె కట్టులో హాజరయ్యారు. తమిళనాడు, కాశీ మధ్య సంబంధాలను బలపరిచేలా నిర్వహిస్తున్న కాశీ తమిళ సంగమం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మోడీ పంచె కట్టులో ప్రత్యేక విమానం నుంచి దిగి నడుస్తూ వస్తున్న ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మోడీ లుక్ చూసి పలువురు నెటిజన్లు సూపర్గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.