ప్రజాధనాన్ని మోడీ లూటీ చేస్తున్నారు

ప్రజాధనాన్ని మోడీ లూటీ చేస్తున్నారు

ప్రధాని మోడీ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. కరోనా టైమ్‌‌లో తన కార్పొరేట్ మిత్రులకు లోన్లను మాఫీ చేయడం ద్వారా పబ్లిక్ మనీని మోడీ లూటీ చేశారని అన్నారు. అస్సాంలో శివసాగర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంతోపాటు మోడీపై విరుచుకుపడ్డారు. దోచుకోవడమే మోడీ ప్రధాన ఉద్దేశంగా మారిందన్నారు. అస్సాంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌‌కు ఓ అవకాశం ఇవ్వాలని కోరారు. అస్సాంను విడదీసేందుకు మోడీ, షా ప్రయత్నిస్తున్నారని.. దీన్ని ఆమోదించేది లేదన్నారు.