నేడు మోడీ‘మన్ కీ బాత్’

నేడు మోడీ‘మన్ కీ బాత్’

ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ తన రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 64వ ఎడిషన్‌లో ప్రసంగించనున్నారు. మోడీ నేటి ‘మన్ కీ బాత్’ లో ఏం మాట్లాడుతారోనని దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈ ఎడిషన్‌లో లాక్డౌన్ సడలింపులు, కరోనా తీవ్రత, దేశ ఆర్థికరంగంపై కరోన ప్రభావం, కరోనాను ఎదుర్కొని ముందుకెళ్లాల్సిన పరిస్థితులపై మోడీ ప్రసంగించనున్నారని సమాచారం.

‘మన్ కీ బాత్’ యొక్క 63వ భాగంలో కరోనా కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులపై మోడీ మాట్లాడారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని మోడీ దేశవ్యాప్త లాక్డౌన్‌ను మార్చి 24న ప్రకటించారు. ఆ తర్వాత అది మే 3 వరకు పొడిగించబడి.. మళ్లీ మే 31 వరకు పొడిగించబడింది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారత్‌లో 1,81,827 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా వల్ల 5, 185 మందికి పైగా మరణించారు. గడిచిన 24 గంటల్లో 8,322 కేసులు నమోదయ్యాయి.

For More News…

కిలో మిడతలు పట్టి తెస్తే రూ.20

ఇవి ఎడారి మిడతలు కావు.. పక్కా లోకల్​

రాష్ట్రంలో ‘అన్​లాక్’పై నేడు సీఎం రివ్యూ