బైద్యనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

బైద్యనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన  బాబా బైద్యనాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  జార్ఖండ్‌  పర్యటనలో భాగంగా ఈ ఆలయాన్ని  సందర్శించారు మోడీ.  ఈ  అలయాన్ని సందర్శించిన తొలి ప్రధాని మోడీనే కావడం విశేషం. ఈ సందర్భంగా 11 మంది అర్చకులు శంఖం ఊదుతూ, పుష్పాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు.  ఆలయ ప్రాంగణం అంతా వేదమంత్రోచ్ఛరణలతో మారుమోగింది.  జార్ఖండ్‌ రాష్ట్రంలో సంతాల్ ప‌ర‌గ‌ణ ప్రాంతంలో ఢియోగ‌ర్ జిల్లాలో  బాబా బైద్యనాథ్ ఆలయం ఉంది. పాట్నా నుంచి 220 కిలోమీటర్ల దూరంలోఉంది. ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయం అవుతాయని భక్తులు నమ్మతారు.