
ప్రధాని మోడీ చేపట్టిన ‘స్వచ్ఛభారత్’ దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. తాజాగా స్వచ్ఛ స్పూర్తిని చాటారు మోడీ. ఢిల్లీలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ను ప్రధాని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐటీపీవో టన్నెల్ ను మోడీ పరిశీలించారు. అయితే అక్కడ కన్పించిన చెత్త, ప్లాస్టిక్ బాటిల్స్ ను స్వయంగా చేతితో తీసివేశారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటించాలని మరోసారి చాటిచెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. కాగా ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా ప్రధాన టన్నెల్ సహా 5 అండర్ పాస్ లను ప్రధాని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును కేంద్రం 920 కోట్లతో నిర్మించింది.
#WATCH | Prime Minister Narendra Modi picks up litter at the newly launched ITPO tunnel built under Pragati Maidan Integrated Transit Corridor, in Delhi
— ANI (@ANI) June 19, 2022
(Source: PMO) pic.twitter.com/mlbiTy0TsR