న్యూఢిల్లీ: వందేమాతరం విషయంలో జవహర్‌లాల్ నెహ్రూ మహ్మద్ అలీ జిన్నాతో రాజీ పడ్డారని.. కాంగ్రెస్ వందేమాతర గేయాన్ని తుక్డే తుక్డే చేసిందని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ప్రధాని మోడీ వందేమాతరంను రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, జాతీయ గీతాన్ని దాని నిజమైన స్ఫూర్తితో నిలబెట్టింది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని ఎదురు దాడి చేసింది. మోడీ ప్రతి సందర్భంలోనూ నెహ్రూ పేరును ప్రస్తావిస్తారని.. కానీ ఆయన ఎంత ప్రయత్నించినా నెహ్రూను కించపరచలేరని కౌంటర్ ఇచ్చింది.
వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం (డిసెంబర్ 8) లోక్ సభలో జాతీయ గీతంపై ప్రధాని మోడీ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఐక్యతకు సింబల్ వందేమాతరం అని అన్నారు. కోట్లాది మందికి వందేమాతరం స్ఫూర్తినిచ్చిందన్నారు. కానీ జవహర్‌లాల్ నెహ్రూ ముస్లిం లీగ్‌కు లొంగిపోయి జాతీయ గీతాన్ని తుక్డే తుక్డే చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇప్పటికీ వందేమాతరంను అవమానిస్తుందని విమర్శలు కురిపించారు.
►ALSO READ | దేశ ఐక్యతకు సింబల్ ..వికసిత్ భారత్ కు స్ఫూర్తి వందేమాతరం: ప్రధాని మోదీ
ఈ క్రమంలో వందేమాతరంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరుఫున మాట్లాడిన ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రధాని మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోడీ వందేమాతరంను రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జాతీయ గీతాన్ని దాని నిజమైన స్ఫూర్తితో నిలబెట్టింది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. మోడీ ప్రతి సందర్భంలోనూ నెహ్రూ పేరును ప్రస్తావిస్తారని.. కానీ ఆయన ఎంత ప్రయత్నించినా నెహ్రూను కించపరచలేరని ఎద్దేవా చేశారు.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశం చేసిన పోరాటంలో వందేమాతరం కేంద్రంగా నిలిచిందని, లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిందన్నారు. బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఎక్కడుందని ప్రశ్నించారు. దేశంలోని ప్రధాన సమస్యలైనా ఓటు చోరీ, నిరుద్యోగం, రూపాయి విలువ పతనం గురించి చర్చకు మాత్రం బీజేపీ సిద్ధంగా లేదని విమర్శించారు. వెంటనే కలగజేసుకున్న బీజేపీ ఎంపీలు టాపిక్‌పైనే డిస్కస్ చేయాలని డిమాండ్ చేశాయి.
