దేశప్రజలంతా నా కుటుంబ సభ్యులే: ప్రధాని మోదీ

దేశప్రజలంతా నా కుటుంబ సభ్యులే: ప్రధాని మోదీ

ప్రధాని మోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్  చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. 140 కోట్ల మంది ప్రజలు తన కుటుంబమని అన్నారు. పాట్నాలో జరిగిన జన్ విశ్వాస్ ర్యాలీలో ప్రధాని కుటుంబంపై మాటల దాడి చేశారు బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్. నరేంద్ర మోదీకి సొంత కుటుంబం లేకపోతే మనం ఏం చేయగలం.. రామమందిరం గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆయన నిజమైన హిందువు కాదు.. ఎవరైనా తల్లిదండ్రులు కొడుకు తప్పనిసరిగా గుండు కొట్టించుకోవాలి.. కానీ మోదీ అలా చేయలేదు. అని లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. దానికి ధీటుగా సమాధానం ఇచ్చారు ప్రధాని మోదీ.

నేను వారి కుటుంబ రాజకీయాలను ప్రశ్నిస్తే.. మోదీకి కుటుంబం లేదని అంటారు.. నా జీవితం తెరిచిన పుస్తకం లాంటింది. దేశ ప్రజలు నన్ను బాగా అర్థం చేసుకుంటారు.. నేను దేశ ప్రజల కోసం జీవిస్తారు. ప్రతి క్షణం నా జీవితం వారికోసమే.. నాకు వ్యక్తిగత కలలు  ఉండవుకానీ.. దేశ ప్రజల కళలే నా సంకల్పం .. అందుకే దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు నా కుటుంబమని అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా చెప్పారు.