తెలంగాణలో టెస్టులు పెంచాలి..పాజిటివ్ రేటు ఎక్కువ ఉంది

తెలంగాణలో టెస్టులు పెంచాలి..పాజిటివ్ రేటు ఎక్కువ ఉంది
  • ఐదు రాష్ట్రాల్లో టెస్టింగ్ తక్కువ,
  • పాజిటివ్ రేటు ఎక్కువగా ఉంది
  • ‘పాజిటివ్’ వాళ్లతో కాంటాక్టు అయిన అందరినీ 72 గంటల్లో గుర్తించాలి
  • టెస్టు లు చేసి కరోనా ఉంటే వెంటనే క్వారంటైన్ చేయాలి
  • దేశంలోని కరోనా కేసుల్లో 80 శాతం పది రాష్ట్రాల్లోనే ఉన్నయి
  • వాటిలో కట్టడి చేస్తే మన దేశం కరోనాపై గెలిచినట్టేనని వెల్లడి
  • కరోనా పరిస్థితిపై పది రాష్ట్రా ల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
  • రాష్ట్రా లు కరోనా డెత్స్పై అసలు లెక్కలు చెప్పాలన్న హెల్త్ సెక్రటరీ

తెలంగాణలో కరోనా టెస్టులు పెంచాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో టెస్టుల సంఖ్య తక్కువగా ఉందని, పాజిటివ్ రేటు చాలా ఎక్కువగా ఉందన్నారు. ట్రేసింగ్, టెస్టింగ్  సమర్థవంతంగా చేస్తే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెప్పారు. పాజిటివ్గా తేలిన వ్యక్తితో  కాంటాక్ట్ అయిన వారిని 72 గంటల్లోగా గుర్తించి, కరోనా సోకిన వారిని క్వారంటైన్ చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు టీమ్గా పోరాడితే కరోనాను కట్టడి చేయవచ్చన్నారు. దేశంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న పది రాష్ట్రాల (మహారాష్ట్ర,తెలంగాణ, బీహార్, యూపీ, పంజాబ్, ఏపీ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, పశ్చిమబెంగాల్) సీఎంలతో ప్రధాని మోడీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, చేపట్టిన చర్యలను తెలుసుకున్నారు. సీఎంల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. దేశంలో కరోనా ఎంటరైనప్పటి నుంచి ప్రధాని రాష్ట్రాలతో సమావేశం నిర్వహించడం ఇది ఏడోసారి.

ఈ రాష్ట్రాల్లో కట్టడి చేస్తే కంట్రోల్లోకి వచ్చినట్టే..

దేశంలో ఆరు లక్షలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉంటే.. ఈ పది రాష్ట్రాల్లోనే 80 శాతం ఉన్నాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. వైరస్ పై పోరాటంలో ఈ రాష్ట్రాలే కీలకమని.. వాటిలో కట్టడి చేస్తే మన దేశం కరోనా మహమ్మారిపై విజయం సాధించినట్టేనని చెప్పారు. ఇప్పటికే దేశంలో రికవరీ రేటు బాగా పెరిగిందని, ప్రభుత్వం చేపట్టిన చర్యలు మంచి రిజల్ట్ ఇస్తున్నాయని తెలిపారు. ‘‘కంటెయిన్ మెంట్, కాంటా క్ట్ట్రేసింగ్, గట్టినిఘా (సరవై్వలెన్స్).. ఈ మూడూ కరోనా మహమ్మారిని ఎదుర్కొనే ఆయుధాలు. పాజిటివ్ వాళ్లకాంటాక్టుల్లో కరోనా సోకినవారిని 72 గంటల్లోగా గుర్తిస్తే.. వైరస్ఇన్ఫెక్షన్ రేటు బాగా తగ్గిపోతగ్గిందని ఎక్స్పర్టులు స్పష్టంగా చెప్తున్నారు. ఈ లెక్కన కాంటాక్ట్ వ్యక్తులందరినీ 72 గంటల్లోగా ట్రేసి, వారందరికీ టెస్టులు చేయాలి. ఓ మంత్రంలా గా దీన్ని పక్కాగా ఆచరించాలి. చేతులు కడుక్కోవడం, సోషల్ డిస్టెన్స్, మాస్కులు పెట్టుకోవడం పక్కాగా చేయాలి.” అని మోడీ పేర్కొన్నారు.

ప్రతిరోజూ చాలెంజే..

కరో నా మహమ్మారి కారణంగా ప్రతిరోజూ ఒక చాలెంజ్గా మారిందని మోడీ అన్నారు. హాస్పిటళ్లపై, డాకర్లు్ట ర్లు, హెల్స్త్టాఫ్ పై తీవ్రంగా ఒత్తిడి పెరిగిందని.. నిత్య జీవితంలో మార్పు వచ్చిందని చెప్పారు. ఇలాంటి టైంలో ఇలాంటి సమావేశాలు, చర్చలు చాలా అవసరమని.. సరైన నిరయాలు, తగిన చర్యలు తీసుకోవడానికి దోహదపడతాయని తెలిపారు. ‘‘ఈ పది రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సంప్రదించుకోవాలి. కరోనా కట్టడిపై చర్చించి, పరిస్థితిని రివ్యూ చేసుకోవాలి. అందరూ తమ ఎక్స్పీరియెన్సులు పంచుకోవడం వల్ల.. ఎలాంటి చర్యలు చేపడితే మంచిది, ఏం చేస్తే బెటర్ అన్నది తెలుసుకోవచ్చు..” అని సూచించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కరోనా కట్టడికి కేంద్ర మంత్రి అమిత్షా నేతృత్వంలో చేపట్టిన చర్యలను మోడీ వివరించారు. కంటెయిన్మెంట్ జోన్ల ఏర్పాటు, పెద్ద సంఖ్యలో టె స్టులు, ముఖ్యంగా హైరిస్క్కేటగిరీలో ఉన్నవాళ్లను స్కానింగ్ చేయడం, హాస్పిటళ్ల ఏర్పాట్లు, ఐసీయూ బెడ్లసంఖ్యను పెంచడం వంటివి మంచి రిజల్ట్ ఇచ్చాయని తెలిపారు.

మరణాల రేటు మరింతగా తగ్గిద్దాం

ప్రపం చవ్యాప్త సగటుతో పోలిస్తేమన దేశంలోకరోనా మరణాల రేటు తక్కువగా ఉందని, దీనినిమరింతగా తగించేం్గ ించేందుకు చర్యలు చేపడదామని సీఎంలకు మోడీ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు 7 లక్షలకుపైగా టెస్టులు చేస్తున్నామని, ఇంకా పెంచేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడం వల్లత్వరగా పేషెంట్లను గుర్తించి, కంటెయిన్మెంట్ చేసేందుకు.. మరణాలను తగించేందుకు వీలవుతోందని స్పష్టం చేశారు. కరోనా మరణాల రేటును ఒకశాతానికన్నా తక్కువకు చేర్చాలన్న లక్ష్యాన్ని త్వరలో అందుకుంటామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, హర్షవర్దన్ పాల్గొన్నారు.

డెత్స్ పై అసలు లెక్కలు చెప్పండి

ప్రధాని, సీఎంల వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా దేశంలో కరో నా పరిస్థి తిపై కేంద్ర హెల్త్డిపార్ట్ మెంట్ సెక్రటరీ ఒక నివే దికను సమర్పించారు. కొన్ని రాష్ట్రాల్లో మరణాలను తక్కువగా చూపుతున్నారని, సరైన లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కొన్నిరాష్ట్రాల్లో యావరేజ్కంటే ఎక్కువ స్థాయిలో కేసులు పెరుగుతున్నా యని.. టెస్టింగ్ కెపాసిటీని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.