ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి మోడీ స్ట్రాంగ్ మెసేజ్ పంపారు: జైశంకర్

ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి మోడీ స్ట్రాంగ్ మెసేజ్ పంపారు: జైశంకర్

న్యూఢిల్లీ: యునైటెడ్ నేషన్స్‌ ఎకనామిక్, సోషల్ కౌన్సిల్ (ఈసీఓఎస్‌ఓసీ) ఎజెండా తయారీలో పాలుపంచుకోవడం ద్వారా ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ప్రధాని మోడీ బలమైన సందేశాన్ని పంపారని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్ మెచ్చుకున్నారు. ‘ఎసీఓఎస్‌ఓసీ ఎజెండాను రూపొందించడంలో తన పాత్ర, భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఇండియా స్ట్రాంగ్ మెసేజ్ పంపించింది’ అని జైశంకర్ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో గ్లోబల్ మల్టీలాటెరల్ సిస్టమ్‌ గురించి మోడీ చేసిన వ్యాఖ్యలను జత చేశారు.

‘ఇవ్వాళ దేశీయంగా స్వీయ చర్యల ద్వారా 2030 అజెండాను అందుకోవడంలో మనం భారీ ముందడుగు వేశాం. ఈ అజెండాలో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాల్సి ఉంది. ఇతర దేశాలు కూడా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అందుకోవడంలో ఇండియా వారికి సహకరిస్తుంది’ అని మోడీ చెప్పారు. ఈ విషయాలను జైశంకర్ తన ట్వీట్‌లో జత చేశారు.