
"మిరియల కషాయం రెగ్యులర్ గా తీసుకోరా.. కరోనా రాదు!" "ఇమ్యూనిటీ పెరగడానికి రోజు రెండు పూటల పసుపు వేసిన పాలు తాగు" గొంతు పట్టేసిందా? అయితే వేడినీళ్లలో కొంచెం తినే వేసుకుని తాగు తగ్గిపోద్ది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటి మాటలు వినిపించడం కామన్ అయిపోయింది. ఇంతకీ వీటిలో ఏవి ఇమ్యూనిటీ బూస్టర్స్? వేటిని ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది? అనే డౌట్స్ చాలానే ఉన్నాయి. వీటి గురించి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో ఓసారి లుక్కేద్దాం.
మసాలా ఛాయ్, తేనె, హాట్ వాటర్, నిమ్మరసం, పసుపు పాలు.. ఇవన్నీ శరీరానికి మంచి చేస్తాయని జనాలకు తెలియంది కాదు. కానీ, ఇన్నాళ్లూ లైట్ తీసుకున్నారు. కరోనా భయం నుంచి బయటపడటానికి అవే ఆయుధాలయ్యాయి. అవి ఇమ్యూనిటీ పెంచతాయనడంలో డౌట్ లేదు. కానీ, వాటిని ఎంత మోతాదులో తీసుకోవాలనే దానిపై క్లారిటీ లేదు. ఏదేమైనా వాటిని మితంగా తీసుకోవాలని అతిగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఢిల్లీలో ఉండే ఫేమస్ డైటీషియన్, క్లినికల్ న్యూట్రిషియనిస్ట్ ఇష్ భోషా అంటున్నారు.
సైడ్ ఎఫెక్ట్స్
మసాలా దినుసులతో ఛాయ్ బాడీకి ఉత్తేజాన్ని ఇచ్చి, మైండ్ ను రీఫ్రెష్ చేస్తుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది. అలాగని ఎక్కువ సార్లు తాగడం మంచిది కాదు. కడుపు నొప్పి, జీర్ణకోశ సమస్యలు, వికారం, చర్మం పోడిబారడం లాంటి సమస్యలు వస్తాయి. అందుకే రెగ్యులర్ గా తీసుకోవడం కంటే బ్రేక్ ఇచ్చి తాగాలి. మసాలా టీలను రోజు విడిచి రోజు లేదంటే వారానికి రెండు మూడు సార్లు తీసుకున్నా ఇమ్యూనిటీ సిస్టమ్ మంచిగా పని చేస్తుంది.
వేడి వేడి నీళ్లు తాగడం వల్ల గొంతు, నాలుక ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వేడి చేసిన తర్వాత... అది చల్లారి గోరువెచ్చగైన తర్వాతే తాగాలి.
ఇవి చేయాలి...
బాడీని బద్ధకంగా ఉంచకుండా రోజూ ఎక్సర్సైజు లేదా యోగా చేస్తే యాక్టివ్ గా ఉంటారు. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలుపుకుని రెండు పూటలా పుక్కిలించాలి. దీన్నే గార్ గ్లింగ్ అంటారు. రోజూ కనీసం మూడు నుంచి ఐదు నిమిషాల పాటు గార్ గ్లింగ్ చేయాలి. బయటికి వెళ్లొచ్చాక చేతులు కడుక్కోవడం, స్నానం చేయడం కంటే ముందుగా గార్ గ్లింగ్ తప్పనిసరిగా చేయాలి. ఆవిరి పట్టడం రోజు విడిచి రోజు చేయడం మంచిది.
►ALSO READ | ఆధ్యాత్మికం: పుణ్యం అంటే ఏమిటి.. దానిని ఎలా పొందాలి..
రోజుకి రెండు గుడ్లు తినడం, పొద్దున లేచాక.. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తాగడం, మంచి డైట్ తీసుకోవడం మర్చిపోవద్దు. అయితే పైన చెప్పుకున్నవేవీ కరోనా వైరస్ ని కచ్చితంగా నాశనం చేస్తాయని సైంటిఫిక్ గా ప్రూవ్ కాలేదు.. కానీ, వీటితో బాడీకి ఎలాంటి డ్యామేజ్ లేకపోవడం వల్ల 'ప్రికాషన్స్'గా పాటించవచ్చని డాక్టర్లు చెప్తున్నారు.
రిస్క్ వద్దు
ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం విటమిన్ ట్యాబ్లెట్లపై ఆధారపడటం వల్ల ఆర్గాన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, విటమిన్లను ఫుడ్ రూపంలో తీసుకోవడమే మంచిది. ఇమ్యూనిటీ బూస్టర్లని మందుల రూపంలో, చిట్కాల రూపంలో హద్దు అదుపు లేకుండా తీసుకోవడం వల్ల హెల్త్ పై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని అమెరికా పబ్లిక్ హెల్త్ కేర్ అసోషియేషన్ ఈ మధ్యే ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. అందులో మన దేశంలో ఇమ్యూనిటీ కోసం తీసుకుంటున్న కేర్ గురించి కూడా ప్రస్తావించింది.
'ఏరియాను బట్టి వెదర్ మారుతుంది. లివింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. దానికి తగ్గట్టే మెటబాలిజం పని చేస్తుంటుంది. కాబట్టి, ఆ చిట్కాలు కొన్ని చోట్ల రిస్క్ పెంచే ఛాన్స్ ఎక్కువ. జాగ్రత్త పేరుతో ఇతరులను ఫాలో అవ్వడం మంచిదికాదు. అలాగని ఇమ్యూనిటీ గురించి ఎక్కువగా ఆలోచించి.. జేబు గుళ్ల చేసుకోవడం కరెక్ట్ కాదు' అని ఆ రిపోర్ట్ సారాంశం.
-V6 వెలుగు