కొత్త పార్లమెంట్లోకి పాదయాత్రగా వెళ్లిన ఎంపీలు

కొత్త పార్లమెంట్లోకి పాదయాత్రగా వెళ్లిన ఎంపీలు

నూతన పార్లమెంట్ భవనంలో ఎంపీలు ఆసీనులయ్యారు. పాత పార్లమెంట్ నుంచి ఎంపీలంతా కొత్త పార్లమెంట్ లోకి తరలివెళ్లారు. పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం ఎంపీలు పాదయాత్రగా కొత్త పార్లమెంట్ భవనంలోకి తరలివెళ్లారు.

 ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ముందు వెళ్తుండగా..వెనకాల ఎంపీలంతా పాదయాత్రగా వెళ్లారు. అటు సెంట్రల్ హాలు నుంచి కొత్త పార్లమెంట్ కు రాజ్యాంగ ప్రతులను తరలించారు.