అగ్ర రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్‌గఢ్‌ను చేర్చడమే బీజేపీ లక్ష్యం: మోదీ

అగ్ర రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్‌గఢ్‌ను చేర్చడమే బీజేపీ లక్ష్యం: మోదీ

దేశంలోని అగ్ర రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్‌గఢ్‌ను చేర్చడమే బీజేపీ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  ఛత్తీష్ గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ అవినీతిలో కూరుకుపోయిందని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(నవంబర్ 2) ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని మోదీ పర్యటించారు.  కాంకెర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  మోదీ పాల్గొని ప్రసంగించారు.

కుటుంబ పాలన, బంధుప్రీతి, అవినీతి అనేవి కాంగ్రెస్‌ విధానాలని విమర్శించారు. కాంగ్రెస్ ఉన్నచోట అభివృద్ధి ఉండదు.. అభివృద్ధి ఉన్న చోట కాంగ్రెస్ ఉండదు.. ఈ  రెండూ ఒకే చోట మనుగడ సాగించలేవని ప్రధాని ఎద్దేవా చేశారు. కుటుంబ పాలన, బంధుప్రీతి, అవినీతి అనేవి కాంగ్రెస్‌ విధానాలని.. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.

ALSO READ : అలాంటి ప్రసక్తే లేదు.. ఐదేళ్లపాటు నేనే సీఎం : సిద్ధరామయ్య

ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని.. కాంగ్రెస్ నాయకుల కుటుంబాలే బాగుపడ్డాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి  ఛత్తీస్ గఢ్ ను అగ్ర రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.  దొచుకున్న ప్రజల సొమ్మను కక్కిస్తామని.. ఆ సొమ్మును పేదలకు పంచుతామన్నారు. ఛత్తీస్ ఘడ్ లో అభివృద్ధి జరగాలంటే.. బీజేపీని గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు.