ఆఫీసుకు టైముకు రండి: కేంద్ర మంత్రులకు ప్రధాని హితవు

ఆఫీసుకు టైముకు రండి: కేంద్ర మంత్రులకు ప్రధాని హితవు

న్యూఢిల్లీ: ప్రతి మంత్రీ టైమ్​ను తప్పనిసరిగా పాటించాలని, సకాలంలో ఆఫీసులకు చేరుకోవాలని ప్రధాని మోడీ హితవుపలికారు. ఇంటి నుంచి పనిచేసే కల్చర్​కు స్వస్తి పలకాలని, రెగ్యులర్​గా ఆఫీసుకొచ్చి పనిచేయడానికే  శ్రద్ధ చూపాలని, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. బుధవారం కేంద్ర కేబినెట్​ సమావేశంలో పలు సూచనలు చేశారు. సహాయ మంత్రుల సేవలను వాడుకోవాలని, ముఖ్యమైన విధుల్లోనూ, కీలకమైన ఫైళ్ల పరిష్కారంలోనూ భాగస్వామ్యం కల్పించాలని చెప్పారు. మినిస్టర్స్​, వారి జూనియర్స్​ కలిసి కూర్చొని ఫైల్స్​ను ఎప్పటికప్పుడు క్లియర్​ చేయాలన్నారు.  ‘‘ఆఫీస్​కొచ్చాక కనీసం ఐదు నిమిషాలు శాఖ పరిధిలోని లేటెస్ట్​ డెవలప్​మెంట్స్​పై అధికారులతో చర్చించుకోవాలి” అన్నారు. మంత్రులకు, ఎంపీలకు తేడాలు లేవని, మంత్రులు కూడా ఎంపీలనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి మంత్రి వారి శాఖల పరిధిలో పక్కా ప్రణాళికను రూపొందించుకోవాలని, ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని పేర్కొన్నారు.  పార్లమెంట్​ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా మంత్రులకు ఆయన పలు సూచనలు చేసినట్లు సమాచారం.