ఈ విజయం అపూర్వం థ్యాంక్స్‌‌: మోడీ

ఈ విజయం అపూర్వం థ్యాంక్స్‌‌: మోడీ

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల స్వరూపం మారిపోయిన ప్రస్తుత తరుణంలో ఒక పార్టీ వరుసగా రెండోసారీ అధికారంలోకి రావడమనేది చాలా పెద్ద విషయమని, మహారాష్ట్ర, హర్యానాలో ప్రజలు బీజేపీని నమ్మినందుకు థ్యాంక్స్​ చెబుతున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలోని పార్టీ హెడ్​క్వార్టర్స్​లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

‘‘మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ సాధించిన విజయం చాలా అపూర్వమైంది. 2014కంటే ముందు ఆ రెండు రాష్ట్రాల్లో మనం జూనియర్​ పార్ట్​నర్​గా ఉండేవాళ్లం. శివసేనలాంటి మిత్రులు చెప్పినట్లు వింటూ, వాళ్లు ఇచ్చిన సీట్లలోనే పోటీ చేసేవాళ్లం. ఐదేండ్ల కిందటి గెలుపుతో దేవేంద్ర ఫడ్నవిస్​, మనోహర్​ లాల్​ ఖట్టర్​ సీఎంలుగా గెలిచారు. అంతకుముందు కనీసం మంత్రులుగా పనిచేసిన అనుభవం లేకున్నా  వాళ్లిద్దరూ ప్రజల కోసం కష్టపడి పనిచేశారు. అందుకే వాళ్లిద్దరినీ ప్రజలు మళ్లీ ఆశీర్వదించారు. హర్యానా ప్రజలు ప్రతి ఐదేండ్లకు ప్రభుత్వాన్ని మార్చేస్తుంటారు. ఫస్ట్​టైమ్​ ఆ సెంటిమెంట్​ను బీజేపీ బ్రేక్​ చేసింది. వరుసగా రెండోసారి అతిపెద్ద పార్టీగా నిలవడమేకాదు, ఓటింగ్​ శాతాన్ని కూడా 33 నుంచి 36 శాతానికి పెంచుకుంది. 2014కంటే ముందు హర్యానాలో బీజేపీకి డబుల్​ డిజిట్ కూడా రాకపోయింది. అప్పటి స్థితితో పోల్చుకుంటే రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రజల మనసులు గెల్చుకుంది”అని మోడీ అన్నారు.

PM Modi thanks people of Maharashtra and Haryana for their blessings in assembly polls