24న వైట్ హౌస్ లో బైడెన్ తో మోడీ భేటీ

V6 Velugu Posted on Sep 20, 2021

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఈనెల 24వ తేదీన భేటీ కానున్నారు. ఈ మేరకు వైట్ హౌస్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అధ్యక్షుడు జో బైడెన్‌, భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య 24న ద్వైపాక్షిక సమావేశం జరగనుందని వైట్ హౌస్ తెలిపింది. ఈ వారంలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్నారు. గత జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీ అమెరికా వెళ్లడం, కరోనా మొదలయ్యాక తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్తుండడం ఇదే తొలిసారి.

గత మార్చి నెలలో వర్చువల్ ద్వారా జరిగిన క్వాడ్ సమ్మిట్ లో అలాగే ఏప్రిల్ నెలలో  క్లైమేట్ చేంజ్ సమ్మిట్, జూన్ నెలలో  జీ-7 దేశాల సమావేశాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. 2019లో అమెరికాలోని హోస్టన్‌ నగరంలో నిర్వహించిన ‘హౌడీ గోడీ’ అనే కార్యక్రమంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి మోడీ పాల్గొన్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అమెరికా పర్యటన తలపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

Tagged , modi biden meeting, Modi-Biden bilateral meet, White House Quad summit, Modi to meet Biden, bilateral talks between Biden and Modi

Latest Videos

Subscribe Now

More News