
దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రధానిమోడీ రేపు (బుధవారం) తమిళనాడులో వర్చవల్‌గా 11 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. గత ఏడేళ్లలో MBBS సీట్లు 79.60 శాతానికి పెంచడం జరిగిందని ప్రధానమంత్రి కార్యాలయం(PMO) తెలిపింది. అలాగే PG సీట్ల సంఖ్య 80.70 శాతం పెరిగాయంది. అంటే గతంలో 2014కి ముందు మొత్తం మెడికల్ సీట్లు 82,500. గత ఏడేళ్లలో దాదాపు 80 శాతం మేర 66,000 సీట్లు పెరిగాయని PMO చెప్పింది. ఇక మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 387 నుండి 596 కి పెరిగిందని... మొత్తంగా దాదాపు 54 శాతం పెరిగిందని తెలిపింది.
మరిన్ని వార్తల కోసం..