మన్ కీ బాత్ మళ్ళీ వస్తోంది.. ఇన్ పుట్ కోరిన ప్రధాని

మన్ కీ బాత్ మళ్ళీ వస్తోంది.. ఇన్ పుట్ కోరిన ప్రధాని

ప్రధాని మోడీ ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వటం కోసం ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ మళ్ళీ ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ఈ ప్రోగ్రాం మళ్ళీ స్టార్ట్ అవ్వనుంది. ఈ మేరకు ప్రధాని మోడీ ఓ ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. చివరి మన్ కీ బాత్ 110వ ఎపిసోడ్ ఫిబ్రవరి 25, 2024న నిర్వహించారు. ఇప్పుడు రాబోయేది 111వ ఎపిసోడ్. జూన్ 30న మన్ కీ బాత్ కొత్త ఎపిసోడ్ ను నిర్వహించనున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ లో తెలిపారు.

ఎన్నికల కారణంగా కొన్ని నెలల విరామం తర్వాత, మన్ కీ బాత్ తిరిగి రాబోతోందని తెలపటం సంతోషంగా ఉందని, ఈ నెల కార్యక్రమం జూన్ 30 ఆదివారం నాడు జరుగుతుందని, దీని కోసం మీ ఆలోచనలు మరియు ఇన్‌పుట్‌లను పంచుకోవాలని నేను మీ అందరికీ పిలుపునిస్తున్నానన్నారు ప్రధాని. My Gov  ఓపెన్ ఫోరమ్, నమో యాప్‌లో కానీ,  1800 11 7800లో మీ సందేశాన్ని రికార్డ్ చేయండి” అని ప్రధాని మోదీ తన X లో పోస్ట్ చేసారు.