సిరివెన్నెల మృతిపై ప్రధాని మోడీ ట్వీట్

సిరివెన్నెల మృతిపై ప్రధాని మోడీ ట్వీట్

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపట్ల ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తననెంతో బాధించిందని అన్నారు. సిరివెన్నెల కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. 

‘అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది. ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.