షిరిడి సాయిబాబాకు మోదీ ప్రత్యేక పూజలు

షిరిడి సాయిబాబాకు మోదీ ప్రత్యేక పూజలు

షిర్డీలోని శ్రీ సాయిబాబా ఆలయ నూతన 'దర్శన క్యూ కాంప్లెక్స్'ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో 86 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూర్చే పథకాన్ని ప్రారంభించడంతో పాటు రూ. 7,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించనున్నారు.

షిర్డీలోని కొత్త 'దర్శన క్యూ కాంప్లెక్స్' అత్యాధునికంగా నిర్మించిన ఆధునిక మెగా భవనం. భక్తుల కోసం అన్ని సౌకర్యాలతో రూపొందించిన ఈ భవనం.. 10వేల కంటే ఎక్కువ మంది భక్తులు కూర్చునే సామర్థ్యంతో అనేక వెయిటింగ్ హాళ్లను కలిగి ఉంది. 2018 అక్టోబర్‌లో ప్రధానమంత్రి దీనికి శంకుస్థాపన చేశారు.

ఆరోగ్యం, రైలు, రోడ్డుస, చమురు, గ్యాస్ వంటి రంగాలలో సుమారు రూ. 7,500 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయడానికి షిర్డీలో జరిగే బహిరంగ కార్యక్రమానికి ప్రధాని హాజరు కానున్నారు. ఈ సమయంలోనే ఆయన నీల్వాండే డ్యామ్ 'జల్ పూజ'ను కూడా నిర్వహించి.. ఆనకట్ట కాలువ నెట్‌వర్క్‌ను జాతికి అంకితం చేయనున్నారు.

ఈ 85 కి.మీ కెనాల్ నెట్‌వర్క్ నీటి పైపుల పంపిణీ నెట్‌వర్క్‌లను సులభతరం చేయడం ద్వారా 182 గ్రామాలకు ప్రయోజనం చేకూరనుంది. నీల్వాండే డ్యామ్ ఆలోచన 1970లో తొలిసారిగా వచ్చిందని.. దాదాపు రూ.5,177 కోట్లతో దీన్ని అభివృద్ధి చేస్తున్నట్లు అంతకుముందు ప్రకటనలో తెలిపారు.

అనంతరం 37వ జాతీయ క్రీడలను ప్రారంభించేందుకు ప్రధాని గోవాకు వెళ్లనున్నారు. గోవాలో తొలిసారిగా జాతీయ క్రీడలు జరుగుతున్నాయని చెబుతూ.. క్రీడా ఈవెంట్‌లో పాల్గొనే అథ్లెట్లను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని ఓ ప్రకటన తెలిపింది. ‘ప్రధాని నాయకత్వంలో దేశంలో క్రీడా సంస్కృతిలో పెనుమార్పు వచ్చిందని.. ప్రభుత్వ నిరంతర సహకారంతో అథ్లెట్ల పనితీరు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా అభివృద్ధి చెందిందని ఇది తెలిపింది. ఇవి అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు జరగనున్నాయి. 28 వేదికలలో 43 క్రీడా విభాగాలలో 10,000 మందికి పైగా అథ్లెట్లు పోటీపడతారు.

ALSO READ : నేనేమైనా పరవాలేదు.. టాలీవుడ్ బాగుండాలి.. బేబీ దర్శకుడి ఫ్యాన్ వార్