కరోనాపై నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ సమీక్ష

కరోనాపై నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ సమీక్ష

ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ గా జరిగే ఈ భేటీలో కేంద్రమంత్రులు అమిత్ షా, మన్ సుఖ్ మాండవీయ, కేంద్రఆరోగ్యశాఖ కార్యదర్శి పాల్గొననున్నారు. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న, తీసుకోవాల్సిన జాగ్రతలపై చర్చించనున్నారు. మరోవైపు 5 నుంచి 12 ఏళ్ల వారికి టీకా అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చింది డీసీజీఐ. దీంతో.. వ్యాక్సినేషన్ పై రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడతున్నారు మోడీ. ప్రస్తుతం దేశంలో కొవిడ్ పరిస్థితిపై ఆరోగ్యకార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రధానికి నివేదిక ఇవ్వనున్నారు. బూస్టర్ డ్రైవ్, కరోనా ఆంక్షలు, నిబంధనలపై రాజేశ్ భూషణ్ ప్రధానితో మాట్లాడనున్నారు.

మరిన్ని వార్తల కోసం

తిరుగుబాటు జెండా ఎగురవేసిన కాంగ్రెస్ అసమ్మతి నేతలు

పాలమూరు ప్రాజెక్టులపై సర్కారు నిర్లక్ష్యం