
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం ప్రశంసిచదగినదని.. దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా మోడీని మెచ్చుకుంటున్నారని డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్మూ జన్ సంవాద్ ర్యాలీని ఉద్దేశించి రాజ్‌నాథ్ మాట్లాడారు. ‘ప్రధాని మోడీ నాయకత్వంలో మైలురాళ్లుగా చెప్పుకునే నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఆర్టికల్ 370 రద్దు కూడా ఒకటి. కరోనాను ఎదుర్కోవడంలో అమెరికా లాంటి గొప్ప దేశాలు సతమతమవుతున్న టైమ్‌లో లాక్‌డౌన్‌ను అమలు చేయడం ద్వారా మోడీ సరైన టైమ్‌లో కరెక్ట్ డెసిజన్ తీసుకున్నారు’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రధాని మోడీ లీడర్‌షిప్‌ను మెచ్చుకుందని రాజ్‌నాథ్ చెప్పారు. లాక్‌డౌన్‌ను దేశమంతా చాలా క్రమశిక్షణతో పాటించిందన్నారు.