న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సామాన్యుడి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్న విపరీతమైన ధరల పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని డిమాండ్ చేసింది. ప్రఖ్యాత బాలీవుడ్ చిత్రం ‘హమ్ కిసీ సే కమ్ నహీ’లోని ‘క్యా హువా తేరా వాదా... వో కసమ్, వో ఇరాదా?’ అనే గీతాన్ని ప్రస్తావిస్తూ కేంద్రాన్ని ఎద్దేవా చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. దేశంలో ఆకాశాన్నంటుతున్న ధరలు పేద, మధ్యతరగతి ప్రజల వెన్ను విరుస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
