త్వరలో మోదీ బయోపిక్‌ .. టైటిల్ ఇదే

త్వరలో  మోదీ బయోపిక్‌ ..  టైటిల్ ఇదే

ప్రధాని నరేంద్ర మోదీ జీవితం అధారంగా త్వరలో బయోపిక్‌ తెరకెక్కనుంది. ఈ బయోపిక్ కు విశ్వనేత అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.  వందే మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై కాశిరెడ్డి శరత్‌ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రానికి   సి.హెచ్‌.క్రాంతి కుమార్‌ దర్శకత్వం వహించనున్నారు.  అన్ని భారతీయ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో అభయ్‌ డియోల్‌, నీనా గుప్తా, అనుపమ్‌ఖేర్‌, పల్లవి జోషి  కీలక పాత్రలు   పోషించనున్నారు. 

ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు.  చాయ్ వాలా విశ్వనేతగా మోదీ ఎదిగిన ప్రస్థానాన్ని ఇందులో చూపించనున్నారు.  ఆర్టికల్ 370 రద్దు, డీమానిటైజేషన్, జీఎస్టీ, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి ఆంశాలను కూడా ఇందులో ప్రస్తావించనున్నారు.   గతంలో మోదీ జీవితంపై 'పీఎం నరేంద్రమోదీ' అనే బయోపిక్ తెరకెక్కింది.  2019 ఎన్నికల సందర్భంగా ఈ మూవీ విడుదల కాగా ఇందులో వివేక్ ఓబెరాయ్ మోదీ పాత్రలో కనిపించారు.