Modi aerial Wayanad survey:వయనాడ్‌లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే.. హెలికాఫ్టర్‍‌లో చూరల్‌మలా, మండక్కైల పర్యవేక్షణ

Modi aerial Wayanad survey:వయనాడ్‌లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే.. హెలికాఫ్టర్‍‌లో చూరల్‌మలా, మండక్కైల పర్యవేక్షణ

వయనాడ్ కొండచరియల ప్రకృతి విపత్తును ప్రధాని మోదీ శనివారం హెలికాఫ్టర్ ద్వారా వీక్షించారు. ఢిల్లీ నుంచి విమానంలో కేరళకు బయలుదేరిన ప్రధాని.. ఉదయం 11 గంటలకు కన్నూర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఆయన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ రిసీవ్ చేసుకున్నారు. అక్కడ నుంచి ఓ ప్రత్యేక విమానంలో వయనాడ్ బయలుదేరారు. కొండచరియలు సంభవించిన చూరల్ మలా, మండక్కై ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు.  

రెస్క్యూ ఆపరేషన్, సహాయక చర్యలు, పునరావాస కేంద్రాల గురించి అధికారులను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులను కలుసుకోని మాట్లాడారు. వయనాడ్ ప్రాంతంలో ప్రకృతి విళయ తాండవం వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించారు. అధికారులతో కేంద్ర సహాయం గురించి చర్చించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను కలుసుకున్నారు. 

తర్వాత ప్రాణాలతో బయటపడిన వారిని కలిసి కొండచరియల విధ్వంసం గురించి తెలుసుకోనున్నారు. ఆయనతోపాటు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ప్రభుత్వ అధికారులు ఉన్నారు.