పవర్ సెక్టార్ ఎక్విప్ మెంట్స్ ను ఇండియాలోనే తయారు చేయండి

పవర్ సెక్టార్ ఎక్విప్ మెంట్స్ ను ఇండియాలోనే తయారు చేయండి

ఎనర్జీ మినిస్టర్స్ తో మీటింగ్ లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పవర్ సెక్టార్ కు సంబంధించి విద్యుత్ శాఖకు ప్రధాని మోడీ ప్రత్యేక సూచనలు చేశారని తెలిసింది. అన్నింటినీ ఒకే తాటిన జమ కట్టడమనే ఫార్ములాకు బదులుగా విద్యుత్ రంగంలో రాష్ట్రాలు తమ పనితీరును మెరుగుపర్చుకోవడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినట్లు సమాచారం. వర్క్ పవర్, న్యూ రినివబుల్ ఎనర్జీ మినిస్టర్స్ తో బుధవారం సాయంత్రం మోడీ రివ్యూ నిర్వహించారు. పవర్ సెక్టార్ లో ఉన్న సమస్యల గురించి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ ఈ మీటింగ్ లో చర్చించారని తెలిసింది. ఈ రివ్యూ సందర్భంగా రివైజ్డ్ టారిఫ్​పాలసీ, ఎలక్ట్రిసిటీ (అమండ్ మెంట్) బిల్లు 2020 పై వారు చర్చించారని విశ్వసనీయ సమాచారం. డిస్కంలు తమ పనితీరు పారామితులను ఎప్పటికప్పుడు పబ్లిష్ అయ్యేలా చూడాలని, తద్వారా కాంపిటీటర్స్ తో ప్రొవైడర్ చార్జీలు ఎలా ఉన్నాయో పోల్చుకోవొచ్చని మోదీ సూచించారని తెలిసింది. అలాగే పవర్ సెక్టార్ లో వినియోగించే ఎక్విప్ మెంట్స్ ను ఇండియాలోనే తయారు చేయాలని మోదీ చెప్పినట్లు సమాచారం. సోలార్ ఎనర్జీ గురించి కూడా మాట్లాడిన మోడీ.. ప్రతి స్టేట్ కనీసం ఒక్క సిటీ అయినా రూఫ్ టాప్ మొత్తం సోలార్ పవర్ ను కలిగి ఉండేలా రూఫ్ టాప్ సలార్ పవర్ జెనరేషన్ ను ఏర్పాటు చేయాలని చెప్పారని సమాచారం. కొత్త, పునరుత్పాదక ఇంధనానికి సంబంధించి సోలార్ వటర్ పంప్స్ నుంచి సోలార్ కోల్డ్ స్టోరేజ్ ల దాకా అన్నింటినీ డీసెంట్రలైజ్ చేయాలని యోచించినట్లు తెలిసింది.