భారత్, బంగ్లా మధ్య ఏడు ఒప్పందాలు

 భారత్, బంగ్లా మధ్య ఏడు ఒప్పందాలు

పేదరిక నిర్మూలన, ఆర్థికవ్యవస్థ అభివృద్ధిపై భారత్-బంగ్లా కలిసి పనిచేస్తాయని బంగ్లా ప్రధాని షేక్ హసీనా అన్నారు. స్నేహం ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుందని.. భారత్ తో తమ స్నేహం అలాంటిదేన్నారు. భారత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు . రక్షణ, వాణిజ్య రంగాలతో పాటు నదీ జలాల పంపిణీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

భారత్-బంగ్లా సంబంధాలు రానున్న రోజుల్లో కొత్త శిఖరాలకు చేరుతాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు .భారత్ బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం వేగంగా పెరుగుతుందన్నారు . ఐటీ, అంతరిక్షం, అణు రంగాల్లో సహకారం అందించాలని నిర్ణయించామన్నారు. విద్యుత్ ప్రసార మార్గాలపై భారత్, బంగ్లాదేశ్ లో కూడా చర్చలు జరుగుతున్నాయన్నారు. 54 నదులు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా ప్రవహిస్తాయన్నారు. కుషియారా నది నీటిభాగస్వామ్యానికి ముఖ్య ఒప్పందం చేసుకున్నామన్నారు . మొత్తం భారత్, బంగ్లాదేశ్ మధ్య ఏడు అవగాహన ఒప్పందాలు జరిగాయి.



రాష్ట్రపతి భవన్ లో షేక్ హసీనాకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. తర్వాత షేక్ హసీనా గౌరవ వందనం స్వీకరించారు. మహాత్మా గాంధీ స్మారక స్థూపం రాజ్ ఘాట్ దగ్గర పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత విజిటర్స్ బుక్ లో సందేశం రాశారు. అక్కడ్నుంచి... హైదరాబాద్ హౌస్ కు బయల్దేరారు. అక్కడ ఇరు దేశాల ప్రధానులు, అధికారుల మధ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగాయి.