చంద్రుడిని పట్టేశావ్ సోమనాథ్.. ఇస్రో చైర్మన్ తో మోదీ

చంద్రుడిని పట్టేశావ్ సోమనాథ్.. ఇస్రో చైర్మన్ తో  మోదీ

చంద్రయాన్ 3 సక్సెస్ అయిన వెంటనే సౌతాఫ్రికా నుంచి  ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో ఛీప్ ఎస్. సోమనాథ్ కు ఫోన్ చేసి అభినందించారు. సోమనాథ్ గారు   మీ పేరులోనే శివుడు ఉండటం వల్ల ఈ మిషన్ సక్సెస్  అయ్యిందంటూ కొనియాడారు. మీకు, ఇస్రో సైంటిస్టులందరికీ అభినందలు. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో  దేశ ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని మోడీ సోమనాత్ తో మాట్లాడారు. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. మనం ఒక అద్భుతాన్ని చూశామన్నారు.  అంతరిక్ష చరిత్రలో  కొత్త చరిత్రను లిఖించామన్నారు.  ఇది నవభారత విజయమని కొనియాడారు మోడీ.  ఇది 140 కోట్ల మంది విజయమని.. ఆజాదీకా అమృత ఘడియల్లో  ఇది తొలి విజయం అని అన్నారు. బ్రిక్స్ సదస్సులో ఉన్నా తన  మనసంతా చంద్రయాన్ 3 పైనే ఉందని చెప్పారు మోడీ. ఇక నవశకానికి కొత్త కథలు చెప్పొచ్చన్నారు మోడీ. చంద్రయాన్ 3 సక్సెస్ తో తన  జీవితం ధన్యమయ్యిందన్నారు. గగన్యాన్ లో కూడా ఇక విజయాలు సాధిస్తామని  చెప్పారు.