ఒడిశాకు ప్రధాని మోడీ..

ఒడిశాకు ప్రధాని మోడీ..

ప్రధాని నరేంద్ర మోడీ ఒడిశాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మోడీ భువనేశ్వర్ చేరుకోనున్నారు రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు.  అనంతరం చుటాక్‌లోని  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  ప్రమాద బాధితులన పరామర్శిస్తారు. కాసేపటి క్రితమే ఉన్నతాధికారులతో రైలు ప్రమాదంపై సమీక్ష నిర్వహించిన మోడీ.. పరిస్థితిపై ఆరాదీశారు.

జూన్ 2న రాత్రి ఒడిశాలోని బాలాసోర్ లో మూడు రైళ్లు ఢీ కొనడంతో 238 మంది చనిపోయారు. 900 మందికి పైగా గాయలయ్యాయి. రైలు పట్టాల్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను అధికారులు బయటకు తీస్తున్నారు. మూడు NDRF బృందాలు,  4 ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు, 15 ఫైర్ రెస్క్యూ టీమ్‌లు, 30 మంది వైద్యులు, 200 మంది పోలీసు సిబ్బంది,  60 అంబులెన్స్‌లను సంఘటనా స్థలం  వద్ద సహాయచ చర్యలు కొనసాగిస్తున్నట్లు ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ వెల్లడించారు.