ఆగస్టు 11న ముషీరాబాద్ ఐటీఐలో అప్రెంటిస్ మేళా

ఆగస్టు 11న ముషీరాబాద్ ఐటీఐలో అప్రెంటిస్ మేళా

ముషీరాబాద్, వెలుగు: ముషీరాబాద్ ప్రభుత్వ ఐటీఐలో సోమవారం ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాధాకృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. ఐటీఐ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, పిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఏసీ మెకానిక్, మెకానికల్ డీజిల్, వెల్డర్ పాసైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్,  జిరాక్స్ కాపీలతో కాలేజీలో హాజరు కావాలన్నారు. అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.