ప్రపంచం బలమైన భారత్ను చూడాలనుకుంటోంది

ప్రపంచం బలమైన భారత్ను చూడాలనుకుంటోంది

ప్రపంచదేశాలు భారత్ను చూసే దృష్టికోణం మారిందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ప్రపంచం బలమైన భారతదేశాన్ని చూడాలని కోరుకుంటోందని అన్నారు. బడ్జెట్, ఆత్మ నిర్భర్ భారత్పై బీజేపీ కార్యకర్తలు, నేతలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆర్థిక స్వావలంబనతో పాటు దేశాభివృద్ధికి బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. గత ఏడేళ్లలో తాము తీసుకున్న నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతూ వస్తోందన్న ఆయన.. ఏడేళ్ల క్రితం లక్షా 10వేల కోట్లుగా ఉన్న జీడీపీ.. ప్రస్తుతం 2లక్షల 30వేల కోట్లు దాటిందని చెప్పారు. వ్యవసాయరంగాన్ని ఆధునీకరించేందుకు బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చినట్లు నరేంద్రమోడీ చెప్పారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా దేశ ఎగుమతులు 4.7 లక్షల కోట్లుకు చేరాయని ప్రకటించారు.

మరిన్ని వార్తల కోసం..

జాతీయ రహదారిపై దర్జాగా రోడ్డు దాటుతున్న పులి

‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్