
న్యూఢిల్లీ: కరోనా నుంచి ప్రజలను రక్షించడంతోపాటు ఎకానమీని కాపాడుకోవడంపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని ప్రధాని మోడీ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడటంతో లాక్‌డౌన్ ఆంక్షలను సర్కార్ సడలించిన సంగతి తెలిసిందే. ‘ఒకవైపు ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారితో ఫైటింగ్ చేస్తూనే మరోవైపు ఎకానమినీ పరిపుష్టం చేయడంపైనా ఫోకస్ చేశాం. ప్రజల ఆరోగ్యంతోపాటు ఎకానమీ గ్రోత్‌కు కూడా సమప్రాధ్యాన్యం ఇస్తున్నాం. ఇండియా పునరుజ్జీవం గురించి మాట్లాడాలంటే కరుణ, సంరక్షణతో వ్యవహరిస్తే ఎన్విరాన్‌మెంట్‌తోపాటు ఎకానమీ కూడా స్థిరంగా ఉంటుంది. ఏదైతే అసాధ్యమని అంటారో దాన్ని సాధిస్తామని ఇండియన్స్ నమ్ముతారు. ఇప్పటికే దేశంలో ఎకానమీ రికవరీకి సంబంధించి గణనీయ మార్పులను చూస్తున్నాం’ అని యూకేలో వర్చువల్‌గా నిర్వహించిన గ్లోబల్ ఇండియా వీక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీ చెప్పారు.
గత ఆరు సంవత్సరాల్లో ఫైనాన్షియల్ ఇన్‌క్లూషన్, రికార్డు స్థాయిలో ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్, సులభతరమైన వ్యాపారం, జీఎస్టీతోపాటు పన్ను సంస్కరణలతో ప్రపంచంలోని అతిపెద్ద హెల్త్ కేర్ ఇనీషియేటివ్ అయిన ఆయుష్మాన్ భారత్‌కు లాభాలు ఆర్జించిందని మోడీ పేర్కొన్నారు. ఓపెన్ ఎకానమీ కలిగిన ప్రపంచంలోని అతి కొద్ది దేశాల్లో ఇండియా ఒకటన్నారు. దేశంలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలని కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నామని వివరించారు.