రేపు వారణాసిలో పలు ప్రాజెక్టులు ప్రారంభించనున్న మోడీ

V6 Velugu Posted on Jul 14, 2021

ప్రధాని నరేంద్ర మోదీ రేపు(గురువారం) వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.744 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతో పాటు దాదాపు రూ.839 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (BHU) లోని MCHలో 100 పడకల ఆస్పత్రితో పాటు  మల్టీ పార్కింగ్‌, గంగా నదిలో పర్యాటకాభివృద్ధికి ఉద్దేశించిన రోరో బోట్లను మోడీ ప్రారంభించనున్నారు. దీంతో పాటు వారణాసి-ఘాజీపూర్ జాతీయ రహదారిపై నిర్మించిన మూడు లైన్ల ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు.

అదే రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు జపాన్‌ సహకారంతో నిర్మించిన ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ రుద్రాక్ష్‌ ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు BHUలోని మాతా శిశు ఆరోగ్య విభాగాన్ని ప్రధాని మోడీ తనిఖీ చేస్తారు. ఆ తర్వాత డాక్టర్లు, ఉన్నతాధికారులతో కరోనా ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.

Tagged pm modi, inaugurate, visit Varanasi, multi-crore projects

Latest Videos

Subscribe Now

More News