మోడీ కేరళ, అస్సాం వెళ్తారు.. రైతుల దగ్గరకు మాత్రం వెళ్లరు

మోడీ కేరళ, అస్సాం వెళ్తారు.. రైతుల దగ్గరకు మాత్రం వెళ్లరు

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. రైతు సంఘాల నాయకులతో కేంద్రం పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఈ సమస్య కొలిక్కి రాలేదు. తాజాగా ఈ విషయంపై మోడీని టార్గెట్ చేసుకుంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం కామెంట్స్ చేశారు. ఎన్నికలు జరగనున్న కేరళ, అస్సాంకు వెళ్లడానికి మోడీకి టైమ్ ఉంటుంది కానీ 20 కి.మీ.ల దూరంలో ఉన్న రైతుల వద్దకు వెళ్లి.. వారి సమస్యను పరిష్కరించడానికి మాత్రం సమయం ఉండదా అని చిదంబరం ప్రశ్నించారు. రైతులను శత్రువుల్లాగా చూస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మోడీ చెబుతున్నారని.. అయితే దేశంలో 6 శాతం మంది రైతులు మాత్రమే మినిమం సపోర్ట్ ప్రైజ్ (ఎంఎస్‌పీ)కు ధాన్యాన్ని అమ్ముతున్నారని స్పష్టం చేశారు.