పీఎన్బీ మెట్లైఫ్ నుంచి కొత్త ఫండ్

పీఎన్బీ మెట్లైఫ్ నుంచి కొత్త ఫండ్

హైదరాబాద్​, వెలుగు:  పీఎన్​బీ మెట్​లైఫ్​ ఇండియా ఇన్సూరెన్స్​ కంపెనీ, పాలసీబజార్​తో కలిసి  పెన్షన్​ కన్జంప్షన్​ ఫండ్‌‌‌‌‌‌‌‌ను పరిచయం చేసింది. ఈక్విటీ-ఆధారిత వృద్ధి ద్వారా దీర్ఘకాలిక రిటైర్మెంట్​ ప్లానింగ్​ను ఇది లక్ష్యంగా చేసుకుంది. న్యూ ఫండ్ ఆఫర్​ఈ నెల 16న మొదలయింది. ఈ నెల  31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్​ఎఫ్​ఓ విండో సమయంలో యూనిట్​ధర రూ. 10 ఉంటుంది. యూనిట్లన అక్టోబర్​ 31న కేటాయిస్తారు. 

ఇది రిటైర్మెంట్​-ఆధారిత పెట్టుబడి ఆప్షన్ ఫండ్.  కన్జూమర్​ట్రెండ్స్​ నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉన్న కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది. పెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ, డిజిటల్​ వినియోగం వంటి అంశాలపై ఫోకస్​చేస్తుంది. ఇది పీఎన్​బీ మెట్​లైఫ్​ స్మార్ట్​ ఇన్వెస్ట్​ పెన్షన్​ ప్లాన్​, స్మార్ట్​ ఇన్వెస్ట్​ పెన్షన్​ ప్లాన్​ ప్రో ద్వారా అందుబాటులో ఉంటుంది.