- వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, వెలుగు: మహిళలు ఆర్థికంగా ఎదగాలని వ్యవసాయ శాఖ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం పాత బాన్సువాడ డాక్రా సంఘంలో ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం వివిధ యంత్రాలను అందిస్తుందని, కుటీర పరిశ్రమ ద్వారా ఆర్థికంగా ముందడుగు వేయాలన్నారు.
ఇప్పటికే ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటిన్ల నిర్వహణ అప్పగించిందన్నారు. అంతకుముందు బాన్సువాడ పట్టణ శివారులోని బోర్లం రోడ్డు పక్కన రూ.20 లక్షలతో (ఎస్డీఎఫ్నిధులు ) వారాల సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం పాత బాన్సువాడ చావడి వద్ద రూ.15 లక్షలతో నిర్మించిన నూతన చావిడి భవనాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, బాన్సువాడ సహకార పరపతి సంఘం చైర్మన్ ఎరువల కృష్ణారెడ్డి, గురు వినయ్ కుమార్, పాశం రవీందర్ రెడ్డి, ముదిరెడ్డి విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
