
హైదరాబాద్, వెలుగు: షావోమీ సబ్–బ్రాండ్ పోకో తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ పోకో ఎఫ్7 స్మార్ట్ఫోన్ను హైదరాబాద్లో గురువారం విడుదల చేసింది. ఇందులో 7,50 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్‌కామ్ స్నాప్డ్రాగన్8ఎస్జెన్4 చిప్‌సెట్, 6.83 అంగుళాల డిస్‌ప్లే, 90 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్, 22.5వాట్ల రివర్స్ ఛార్జింగ్, వెనుకవైపు 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, ముందు భాగంలో 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత షావోమీ హైపర్ ఓఎస్ 2.0 తో వస్తుంది. 4 సంవత్సరాలపాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లు, 6 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇస్తారు. ధరలు రూ.30 వేల నుంచి మొదలవుతాయి. అమ్మకాలు ఫ్లిప్కార్ట్లో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మొదలవుతాయి. కొన్ని బ్యాంకుల కార్డులతో కొంటే రూ.రెండు వేల వరకు డిస్కౌంట్ వస్తుంది.