సూర్యాపేట, వెలుగు: సూర్యాపేటకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా కేంద్రానికి చెందిన గండూరి కృపాకర్ కుమారుడు రిక్కీ పట్టణానికి చెందిన బాలికను వేధింపులకు గురిచేశాడు.
రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట టౌన్ సిఐ వెంకటయ్య తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు సిఐ పేర్కొన్నారు.
