కామెడీ థ్రిల్లర్గా పొడగంటిమయ్యా

కామెడీ థ్రిల్లర్గా పొడగంటిమయ్యా

యత్రీంద్ర, రమ్య దినేష్ హీరో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా ఏ ఫణీంద్ర దర్శకత్వంలో సురేఖ కొలచెల నిర్మిస్తున్న చిత్రం ‘పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమ’. శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం ఈ మూవీ మోషన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇదొక  ఉత్కంఠభరితమైన కామెడీ  థ్రిల్లర్.  రాత్రి సమయంలో ఒక హాస్పిటల్ చుట్టూ తిరిగే కథ.   యతీంద్ర ఒక విభిన్నమైన పాత్రలో కనిపిస్తారు. ఇప్పటికే కొంత భాగం షూట్ చేశాం.  ఏప్రిల్ 15 తర్వాత అమలాపురం పరిసర ప్రాంతాల్లో  40 రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తాం’  అని తెలిపారు.