మనలో చాలా మందికి పోకిమాన్ గురించి తెలుసు. చిన్నతనంలో వచ్చిన పోకిమాన్ కార్డ్స్ చాలా ఫేమస్. చాలా మంది ఈ కార్డులను ఒక కలెక్షన్ రూపంలో సేకరించేవారు. దానిని ఒక జ్ఞాపకంగా.. తమకు నచ్చిన క్యారెక్టర్ గుర్తుగా తమ ఇళ్లలో ప్రత్యేక స్థానం కల్పించిన ఫ్యాన్స్ ఎందరో.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మలేషియాలోని ఒక పోకిమాన్ అభిమాని గురించే. షా ఆలమ్ ప్రాంతానికి చెందిన దమిరాల్ ఇమ్రాన్ అనే వ్యక్తి తన వద్ద ఒక రూమ్ నిండా ఉన్న పోకిమాన్ కార్డ్ కలెక్షన్ అమ్మేయటంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఎంతో ఇష్టంగా కలెక్ట్ చేసిన పోకిమాన్ ట్రేడింగ్ కార్డులను భారత కరెన్సీ ప్రకారం రూ.3కోట్ల 80 లక్షలకు సేల్ చేయటం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇది జస్ట్ ఒక డీల్ కాదని తన ప్యాషన్, పోకిమాన్ లెగసీకి సంబంధించిన కథగా ఇమ్రాన్ చెబుతున్నారు.
తాను ఒక చిన్న రూమ్ లో జాగ్రత్తగా దాచుకున్న పోకిమాన్ కార్డ్ కలెక్షన్ కి సంబంధించిన ఫోటోలను ఇమ్రాన్ పంచుకున్నారు. అయితే వీటిని కొన్నది కూడా మలేషియాకు చెందిన మరో వ్యక్తే కావటం విశేషం. అయితే అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ స్పోర్ట్స్ అథెంటికేటర్ అనే సంస్థ కార్డుల నాణ్యత, ఒరిజినాలిటీని వెరిఫై చేసినట్లు తేలింది. ఇమ్రాన్ తన కలెక్షన్ మెుత్తాన్ని ఆన్ లైన్ ఆక్షన్ రూపంలో అమ్మాడు. ఎక్కువ రేటు కోట్ చేసిన వారికి వాటిని అమ్మినట్లు చెప్పాడు.
మెుదటగా 1996లో పోకిమాన్ కార్డ్స్ జపాన్ లో లాంచ్ అయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్లకే పోకిమాన్ వీడియో సిరీస్ గేమ్‌గా ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా ఆధరణను పొందింది. కాలక్రమేణా.. కార్డులు పిల్లల ఆట వస్తువుల స్థాయి నుంచి అంతర్జాతీయ వేలంలో అధిక ధరలను పలికే కలెక్షన్ వస్తువులుగా మారాయి. దీంతో చాలా మంది ఫస్ట్ జనరేషన్ కార్డ్స్ కోసం వెతకటంతో పాత పోకిమాన్ కార్డ్ కలెక్షన్ ఉన్న వారికి కాసుల వర్షం కుసుస్తోంది. ముఖ్యంగా ఒరిజినల్ బేస్ సెట్ నుంచి వచ్చినవి అత్యంత విలువైనవిగా మారిపోయాయి. అరుదైన కార్డుల కోసం భారీ మెుత్తాలను ఫ్యాన్స్ ఆఫర్ చేయటం దీనికున్న క్రేజ్ ఏంటో నిరూపిస్తోంది.
