
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: ఈ నెల 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ యోగేశ్గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, మీటింగ్ లు, బహిరంగ సభలు నిర్వహించరాదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలను వ్యాప్తి చేసేవారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.