ప్రీతిది అనుమానాస్పద మృతి కేసుగా మార్చే యోచనలో పోలీసులు..!

ప్రీతిది అనుమానాస్పద మృతి కేసుగా మార్చే యోచనలో పోలీసులు..!

వరంగల్ లో ఇటీవల మృతి చెందిన మెడికో ప్రీతి కేసు పోలీసులకు సవాలుగా మారింది. ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్ లో ఎలాంటి విషపదార్థాలు లేనట్టు తెలింది. ఆమె బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని టాక్సికాలజీ రిపోర్ట్ లో వెల్లడైంది. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లోనూ ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్ లో అధికారులు పేర్కొన్నారు. తాజాగా వరంగల్ సీపీ రంగనాథ్ సీపీ చేతికి ఈ టాక్సికాలజీ రిపోర్ట్ చేరింది.

అయితే ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసును అనుమానాస్పద మృతి కేసుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెది హత్యా, ఆత్మహత్యా అనేది పోలీసులు తేల్చుకోలేకపోతుండడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. కానీ ప్రీతిది ఆత్మహత్య కాదని, ఆమెది హత్యే అని ప్రీతి కుటుంబ సభ్యులతో పాటు విపక్షాలు కూడా ఆరోపిస్తుండడం గమనార్హం.