అబ్దుల్లాపూర్ మెట్ మహిళ మర్డర్ కేసులో నిందితులు అరెస్ట్

V6 Velugu Posted on Nov 24, 2021

రెండు రోజుల క్రితం  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం తారమతి పేట్ లో  అత్యాచారం,హత్యకు గురైన మహిళ కేసును ఛేదించారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు. అదే గ్రామానికి చెందిన దేవరాయ సురేష్(30), బొడిగే శ్రీకాంత్ లను అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి బంగారం దోచుకునేందుకు  నిందితులు ముందస్తుగా ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ఆమె భర్తను పక్క ఊరికి తీసుకెళ్లి అతిగా మద్యం తాగించి హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.  వారి ప్రవర్తనలో మార్పు కనిపించడంతో అనుమానంతో  వారి నుండి తప్పించుకున్నాడు ఆమె భర్త మల్లేష్.  తిరిగి ఇంటికి వచ్చిన నిందితులు ఒంటరిగా ఉన్న మహిళపై  లైంగిక దాడి చేసి, హత్య చేసి గోల్డ్ మెట్టెలు,ఇయర్ రింగ్స్ తో పాటు 25తులాల పట్టగొలుసులు ఎత్తుకెళ్లారు.  గ్రామ శివారు వైపు వెళ్తున్న మహిళను చూసి అత్యాచారం, హత్య చేసి దోపిడీ చేశారు. ఆమె వద్ద ఉన్న ఆభరణాలు దోచేయాలని ప్లాన్ చేసి ఈ దారుణానికి ఒడిగట్లారు.  ఆధారాలు దొరకకుండా జాగ్రత పడి ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా ప్లాన్  చేశారు.  నిందితులపై 302,376D,382 R/w 201 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కు తరలించామని చెప్పారు.

Tagged Rangareddy district, Police Arreste, 2 acused, Abdullapur, Taramati Pete , WOMENRape, Murder

Latest Videos

Subscribe Now

More News