సిటీలో ఆగని నైజీరియన్ డ్రగ్స్ దందా

సిటీలో ఆగని నైజీరియన్ డ్రగ్స్ దందా

బంజారాహిల్స్ అడ్డాగా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న నైజీరియన్ ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 20 గ్రాముల కొకైన్, 9 ఎండీఎంఏ పిల్స్, వేయింగ్ మిషన్ తో పాటు మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇతడు డ్రగ్స్ అమ్ముతూ ఇప్పటికే మూడు సార్లు అరెస్టయ్ యాడు. నిందితుడి వివరాలను టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ శనివారం వెల్లడించారు. నైజీరియాలోని లగోస్ రాష్ట్రానికి చెందిన జాన్ పాల్ అనిబుచి(35) ఫుట్ బాల్ ప్లేయర్.విజిటింగ్ వీసాపై 2008లో ఇండియా వచ్చాడు.2008 అక్టోబర్ నుంచి కేరళలో ఉన్నాడు. 2015లో హైదరాబాద్ కు మకాం మార్చాడు. డ్రగ్స్ అలవాటు ఉండడంతో వారాంతంలో జాన్ పాల్ గోవాకు వెళ్లి నైట్ పబ్ కల్చర్ లో డ్రగ్స్ తీసుకునేవాడు. అక్కడ ఉన్న కొంత మంది నైజీరియన్స్ కొకైన్, గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్మడం గమనించాడు. గోవాలో తనకున్న పరిచయాలతో తను కూడా డ్రగ్స్ సప్లయ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. గోవాలో తక్కువ ధరకు దొరికే కొకైన్ ను హైదరాబాద్ లో కస్టమర్లకు జాన్ పాల్ సప్లయ్ చేసేవాడు. అలాగే గోవాలో గంజాయి అమ్ముతూ 2016లో గోవా మపుసా పోలీసులకు చిక్కాడు.

ఈ కేసులో మసుసా కోర్టు నైజీరియన్ జాన్ పాల్ కు మూడు నెలల జైలుశిక్ష విధించింది. అనంతరం జైలు నుంచి విడుదలైన జాన్ పాల్ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో కొన్ని రోజులు ఉన్నా డు. తిరిగి డ్రగ్స్ సప్లయ్ చేస్తూ 2017 ఆగస్టులో ఎల్బీనగర్ పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో జాన్ పాల్ నుంచి 7 గ్రాముల కొకైన్, పాస్ పోర్టును ఎల్బీనగర్ పోలీసులు స్వా ధీనం చేసుకున్నా రు. గతేడాది జూన్ లో జైలు నుంచి జాన్ విడుదలయ్యాడు. ఆ తరువాత బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12కి షిఫ్ట్ అయ్యాడు. ఎప్పటి లాగే తనకు టచ్ లో ఉన్న కస్టమర్లకు కావాల్సి న కొకైన్, గంజాయి, ఎండీఎంఏ పిల్స్ ను సప్లయ్ చేయడం ప్రారంభించాడు. డిమాండ్ ను బట్టి అమ్మకం డ్రగ్స్ దందాలో భాగంగా 1గ్రాము కొకైన్ ను రూ.5 వేలకు కొను గోలు చేసేవాడు. డిమాండ్ ను బట్టి రూ.7 నుంచి 8వేల వరకు అమ్మి సొమ్ము చేసుకునేవాడు. జాన్ పాల్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్ స్పె క్టర్ గట్టుమల్లు ఆధ్వర్యం లోని పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్ రెడ్డితో పాటు పీసీ లోకేశ్వర్ రావు టీం స్కె చ్ వేసి నైజీరియన్ జాన్ పాల్ అనిబుచిని అరెస్ట్ చేసింది. నిందితుని నుంచి 20 గ్రాముల కొకైన్,9 ఎండీఎంఏ పిల్స్, వేయింగ్ మిషన్ తో పాటు మొబైల్ ను స్వా ధీనం చేసుకుంది. వరుసగా డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డ జాన్ పాల్ పై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని సీపీ అంజనీకుమార్ చెప్పారు. నిందితుని దగ్గర స్వా ధీనం చేసుకున్న కొకైన్ ధర అంతర్జాతీయం మార్కె ట్లో 330 డాలర్లు,ఇండియన్ మార్కెట్లో రూ.4.65 లక్షలు విలువ ఉంటుందని సీపీ తెలిపారు.