వాచ్మెన్ తో గొడవ.. ఆర్ఆర్ఆర్ డాన్సర్ అరెస్ట్

వాచ్మెన్ తో గొడవ.. ఆర్ఆర్ఆర్ డాన్సర్ అరెస్ట్

ఆర్ఆర్ఆర్ డాన్సర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎత్తర జెండా అనే సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా చివరిలో వచ్చే ఈ పాటకి, ఆపాటలో చరణ్, తారక్ ల డాన్స్  కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

అలాంటి సూపర్ హిట్ సాంగ్ లో సైడ్ డాన్సర్ గా కనిపించాడు మణికంఠన్. అతను గత కొంతకాలంగా బంజారా హిల్స్ రాఘవ రెసిడెన్సీలో మరో నలుగురు డ్యాన్సర్లతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలోనే గత రాత్రి మణికంఠన్ తన ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగి గొడవ చేస్తుండగా.. వాచ్ మెన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. కారిడార్ లో గొడవ చేయవద్దని సూచించగా.. కోపం తట్టుకోలేకపోయిన మణికంఠన్ వాచ్ మెన్ తో గొడవపడ్డాడు. అతడిని బిల్డింగ్ మూడవ అంతస్తు నుంచి కిందకి తోసేశాడు.

దీంతో తీవ్ర గాయాలపాలైన వాచ్ మెన్  ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు మణికంఠన్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన మణికంఠన్.. ప్రస్తుతం టాలీవుడ్ లో పలు సినిమాల్లో డాన్సర్ గా చేస్తున్నాడు.